Hyderabad devotee padayatra to Ayodhya
అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవంలో ప్రతీఒక్కరూ ఏదో ఒకరకంగా భాగస్వాములు కాబోతున్నారు. హైదరాబాద్కు
చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి అనే భక్తుడు 8 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి
శ్రీరాముడి కోసం బంగారు పాదుకలను అయోధ్యకు తీసుకెళుతున్నాడు.
రూ. 65 లక్షల విలువ
చేసే బంగారుపూత కల్గిన పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు కాలినడకన శ్రీరాముడి వనవాస
మార్గంలో బయలు దేరాడు.
రామాలయ
నిర్మాణం కోసం ఐదు వెండి ఇటుకలను కూడా విరాళంగా అందజేశాడు. జూలై 20న పాదయాత్ర
ప్రారంభించిన శాస్త్రి, జనవరి 22న అయోధ్యకు చేరుకోనున్నారు.
తన
తండ్రి అయోధ్య కరసేవలో పాల్గొన్నారని చెబుతున్న శాస్త్రి, రామమందిర నిర్మాణం కోసం ఆయన తపించేవారని
చెప్పారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా బాధ్యతలు
నిర్వహిస్తోన్న శాస్త్రి, అయోధ్యలో స్థిర నివాసం ఏర్పరుచుకోనున్నట్లు తెలిపారు.
రామమందిర ప్రారంభోత్సవ ఘట్టాన్ని ఉత్తరప్రదేశ్ లోని
అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆ రాష్ట్ర జైళ్ళ శాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి
తెలిపారు. పరిస్థితుల ప్రభావంతోనే వారంతా నేరస్తులుగా మారారని, పవిత్రకార్యక్రమానికి
వారిని దూరంగా ఉంచకూడదనే ఉద్దేశంతో లైవ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.