ఒక
దేశం-ఒకే ఎన్నిక విధానంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రజల
నుంచి సలహాలు సూచనలు స్వీరిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సూచనల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
onoe.gov.in వెబ్సైట్ కు లేదా sc-hlc@gov.in
కు సలహాలు, సూచనలు పంపాలని కమిటీ కోరింది. సలహాల
స్వీకరణకు ఆఖరి గడువు జనవరి 15 గా నిర్ణయించింది.
గత
ఏడాది సెప్టెంబర్ లో ఈ కమిటీని నియమించగా ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమై జమిలి
ఎన్నిక ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేసింది.
ఆరు
జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీలు సహా ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు
పొందని మరో ఏడు పార్టీలకు అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ లేఖలు రాసింది.
రెండో
దఫా భేటీలో భాగంగా లా కమిషన్ తో సమావేశమైన కమిటీ, జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చించింది.
లోక్
సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందనేది
కేంద్ర ప్రభుత్వ భావన. దేశంలో 1967 వరకు లోక్ సభ, శాసనసభలకు
ఎన్నికలు జరిగాయి.
ఇందుకోసం
న్యాయ, రాజకీయ నిపుణులతో కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే పని
ప్రారంభించింది.
కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షత
వహిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్ష మాజీ నేత గులాంనబీ
ఆజాద్, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ కార్యదర్శి సుభాష్
కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయశాఖ
మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ప్రత్యేక
ఆహ్వానితులుగా ఉన్నారు.