774 new Covid cases, two deaths
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 774 మందికి కరోనా పాజిటివ్ గా
తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహమ్మారి సోకిన కారణంగా ఇద్దరు చనిపోయారు.
అందులో గుజరాత్ కు చెందిన ఒకరు ఉండగా, మరొకరు తమిళనాడులో చెందిన వ్యక్తి .
దేశంలో జనవరి 2020న తొలి కేసు వెలుగులోకి రాగా ఇప్పటి వరకు ఈ వైరస్ 4,50, 17,431 మందికి
సోకింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు ఈ రాకాసి వైరస్ కారణంగా 5,33,387 మంది
ప్రాణాలు విడిచారు. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,44,79,804కు చేరింది.
నిన్న ఒక్కరోజు (జనవరి 5) 34,660 మందికి
పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటి
వరకు దేశవ్యాప్తంగా 220, 67, 81, 345 వ్యాక్సిన్ డోసులు వేశారు. ప్రస్తుతం దక్షిణాదిలోనే
ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
కర్ణాటకలో 1,160 మందికి పాజిటివ్ గా తేలగా, 1160 మందికి వైరస్ సోకినట్లు
నిర్ధారణ జరిగింది. తమిళనాడులో 188 మంది మహమ్మారి బారిన పడగా, మహారాష్ట్రలో 931
మందికి సోకినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.