తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ 26 రోజులుగా సమ్మె చేస్తోన్న అంగన్వాడీలపై (anganwadi workers strike) ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అత్యవసర సేవల చట్టం ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఎస్మా ప్రయోగిస్తే ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు చేయడానికి అవకాశం ఉండదు.వెంటనే విధుల్లోకి చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశముంది.
ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తామని చెప్పి సీఎం జగన్మోహన్రెడ్డి మోసం చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. ఎస్మా ప్రయోగించడంతో ఇక ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండే అవకాశం లేదు.