ED names Chattisgarh ex
CM in betting scam charge-sheet
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో ఆసక్తికర
పరిణామం చోటు చేసుకుంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణాన్ని (Mahadev Betting App Scam) విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate), ఆ కేసులో దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్లో (Supplimentary Chargesheet) మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) పేరును
ప్రస్తావించింది. మహాదేవ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల లంచాలు తీసుకున్నారనే (Bribe to ex-CM) ఆరోపణలకు సంబంధించి ఆ ఛార్జిషీట్ దాఖలైంది.
ఈడీ ఛార్జిషీట్ ప్రకారం… మహాదేవ్ యాప్
ప్రమోటర్, నిందితుడు అయిన శుభం సోనీ (Subham
Soni) ఈడీ విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ
కేసుకు సంబంధించిన ఛార్జిషీట్లో పలువురి పేర్లను ప్రస్తావించారు. ప్రమోటర్ శుభం
సోనీ, అనిల్ కుమార్ అగర్వాల్ (Anil
Kumar Agarwal), రోహిత్ గులాటీ (Rohit Gulati), భీంసింగ్ యాదవ్
(Bhimsingh Yadav), అసీమ్దాస్ (Asim Das) వంటి పేర్లు ఆ ఛార్జిషీట్లో ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఈడీ 2024 జనవరి 1న
మనీ లాండరింగ్ నేర ఆరోపణలపై (Money Laundering) రాయపూర్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు
చేసింది. దాని ప్రకారం అసీమ్దాస్ అనే నిందితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహాదేవ్ యాప్ ప్రమోటర్ శుభం సోనీ, నాటి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు
ఒక భారీ మొత్తం అందజేయాలంటూ అసీమ్దాస్కు పెద్ద స్థాయిలో నగదు అందజేసాడు.
ఛార్జిషీట్లో మిగతా వివరాలు ఇలా
ఉన్నాయి… శుభం సోనీ 2023 అక్టోబర్ 25న అసీమ్
దాస్‌ను దుబాయ్ రమ్మని పిలిచాడు. భూపేష్ బఘేల్‌కు అందజేయవలసిన మొత్తాన్ని అక్కడే
ఇచ్చాడు. భారత్ చేరుకున్నాక భూపేష్ బఘేల్‌కు సుమారు రూ.10 కోట్లు చెల్లించాలని
చెప్పాడు.
2023 నవంబర్ 2న ఈడీ అసీమ్ దాస్ నివాసంపై
దాడి చేసి, అతనింటి ఆవరణనుంచి రూ.5.39 కోట్ల నగదు సీజ్ చేసింది. ఆ నగదును నాటి సీఎంకు
అందజేయాలని తనకు శుభం సోనీ చెప్పాడని దాస్ దర్యాప్తులో వివరించాడు. ఆ మేరకు శుభం
సోనీ పంపిన ఇ-మెయిల్స్, స్టేట్మెంట్స్, ఇతర ఆధారాలను సేకరించారు. మహాదేవ్ యాప్
నిర్వాహకుల తరఫున నాయకులకు డబ్బులు పంచే పనిని భీంసింగ్ యాదవ్ అనే వ్యక్తి కూడా
చేసాడని చంద్రభూషణ్ వర్మ అనే సాక్షి గతంలోనే వెల్లడించారు.