Door blew open mid-air,
plane makes emergency landing
అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు (Alaska Airlines Flight) చెందిన ఒక విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే, దాని తలుపుల్లో ఒకటి
ఊడి పడిపోయింది (Mid Cabin Door
separated). దాంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది.
అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్
737-9 మ్యాక్స్ విమానం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని ఒంటారియో
విమానాశ్రయానికి వెడుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మిడ్-క్యాబిన్ ఎగ్జిట్ డోర్
పూర్తిగా ఊడిపోయి కింద పడిపోయిన దృశ్యాన్ని ప్రయాణికులు చిత్రీకరించారు.
‘‘పోర్ట్‌ల్యాండ్ నుంచి
కాలిఫోర్నియాలోని ఒంటారియో వెళ్ళడానికి ఎఎస్1282 విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ
సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
ఉన్నారు. విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ
విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
పూర్తి వివరాలు తెలిసిన వెంటనే పంచుకుంటాం’’ అని అలాస్కా ఎయిర్‌లైన్స్ ట్వీట్
చేసింది.
విమానంలో ఈ అనుకోని సంఘటన జరిగే సమయానికి
విమానం టేకాఫ్ పూర్తి చేసుకుని 16,325 అడుగుల గరిష్ట ఎత్తుకు చేరుకుంది. ఘటన
జరిగిన వెంటనే పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయం ఏటీసీని సంప్రదించి తిరిగి వెనక్కు
వచ్చి ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని అమెరికా నేషనల్
ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రకటించింది.
తలుపు ఊడిపోయిన బోయింగ్
737 మ్యాక్స్ విమానం పాతదేం కాదు, కొత్తదే. ఈ విమానాన్ని అలాస్కా ఎయిర్‌లైన్స్
2023 అక్టోబర్ 1న కొనుగోలు చేసింది. దాని వాణిజ్య వినియోగం 2023 నవంబర్ 11న
మొదలైంది. ఇప్పటివరకూ కేవలం 145 సార్లు మాత్రమే ప్రయాణించింది. అంతలోనే ఇలాంటి
ప్రమాదం జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.