Aditya-L1 To
Enter Final Orbit
సౌరవ్యవస్థ
పై అధ్యయనాల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 తుదిలక్ష్యానికి చేరువగా
వెళ్లింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అంతరిక్ష ప్రయాణంలో తుదిఅంకానికి చేరుకోనుంది.
ఎల్ 1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలోకి ప్రవేశించి అక్కడి నుంచి సౌర వాతావరణంతో పాటు
అంతరిక్ష మార్పులను పరిశీలించింది.
మిషన్
నింగిలోకి వెళ్ళాక చేపట్టిన నాలుగు విన్యాసాలు ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్-1
ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతమయ్యాయి. దీంతో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న
లాగ్రాంజ్ పాయింట్1 చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్ లో నిలిపేందుకు ఇస్రో సన్నాహాలు
చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.
ఆదిత్య
సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో
ప్రయోగించింది.
భూమి
నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఆదిత్య ఎల్ 1 సౌర కుటుంబంతో పాటు అంతరిక్ష
మార్పులను అంచనా వేసి ఇస్రో కు సమాచారాన్ని చేరవేస్తోంది. భూ గురుత్వాకర్షణ శక్తి
నిష్క్రియంగా ఉన్న ప్రాంతాన్నే ఎల్ 1 అంటారు. అక్కడ హాలో కక్ష్యలో ప్రవేశ పెట్టడం
ద్వారా ఎలాంటి గ్రహణ సమయాల్లోనూ అవాంతరాలు
లేకుండా సౌర వాతావరణాన్ని నిశితంగా పరిశీలించవచ్చు.
ఒక వేళ
దానిని హాలో కక్ష్యలో ప్రవేశపెట్టకపోతే ఉపగ్రహం సూర్యుడి వైపు దూసుకుకెళుతుందని
ఇస్రో వెల్లడించింది.
ఈ ప్రయోగం కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేశారు.
ఏడు పేలోడ్లతో 1500 కేజీల బరువు ఉంటుంది.
ఆదిత్య
ఎల్ 1 లో ఏడు సైంటిఫిక్ పేలోడ్ లు ఉండగా,
ఈ పేలోడ్ లు అన్నీ ఇస్రో, జాతీయ పరిశోధనా ప్రయోగశాలల్లో స్వదేశీయంగా
అభివృద్ధి చేశారు. విద్యుదయస్కాంత కణం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్ లను ఉపయోగించి
ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా ను గమనించిడానికి ప్రత్యేకంగా వీటిని రూపొందించారు.