దక్షిణాఫ్రికాపై కేప్‌టౌన్ టెస్టులో విజయాన్ని సాధించిన భారత జట్టు, ప్రపంచ
టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో
నిలిచింది. 54.16 శాతం పాయింట్లతో భారత్
టాప్ లో ఉండగా 50 శాతం పాయింట్లతో సౌతాఫ్రికా రెండో స్థానానికి దిగజారింది.
45.83 శాతం పాయింట్లతో పాకిస్తాన్ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది.
మూడు, నాలుగు స్థానాల్లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా ఉండగా బంగ్లాదేశ్ జట్టు ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పాకికస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో
టెస్ట్ మ్యాచ్ ఫలితం ఆధారంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు
చోటుచేసుకుంటాయి.
మరో వైపు ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్
జట్టు రెండో స్థానానికి చేరుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 118 పాయింట్లతో ఆసీస్
అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానానికి పరిమితమైంది.
ప్లేయర్ల
ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ రెండేళ్ల తర్వాత టాప్ టెన్ ప్లేస్ లో స్థానం
సంపాదించాడు.