కోవిడ్ మరోసారి విజృంభిస్తోంది. దేశంలో తాజాగా కరోనా కేసులు 4423కు చేరగా, మరణించిన వారి సంఖ్య ఒక్క రోజే 12కు చేరింది. తాజాగా గడచిన 24 గంటల్లోనే 761 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. యాక్టివ్ కేసులు 4334కు తగ్గాయని తెలిపారు. అత్యధికంగా కేరళలో 1249 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 1240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్గఢ్, ఏపీలో 128 చొప్పున నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యూపీలో ఒకరు చనిపోయారు.
కొత్త వేరియంట్ జేఎన్ 1 (covid jn1) కేసులు కూడా పెరుగుతున్నాయి. జనవరి 4వ తేదీ నాటికి 12 రాష్ట్రాల్లో 619 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటకలో అత్యధికంగా 119, కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్ 36, ఏపీ 30, తమిళనాడు 26, ఢిల్లీ 15, రాజస్థాన్ 4, తెలంగాణలో2 కేసులు నమోదయ్యాయి.డిసెంబరు 5, 2023 నుంచి ప్రతి రోజూ రెండంకెల సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. చలి పెరగడంతో కోవిడ్ వేగంగా వ్యాపిస్తోంది.