శ్రీకృష్ణుడి
జన్మభూమి మధురలో షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ కోర్టు చెప్పిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయ
స్థానం కొట్టివేసింది.
హైకోర్టు
ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా , దీపాంకర్ దత్త ధర్మాసనం,
ఈ వివాదంపై పలు వ్యాజ్యాలు కోర్టు లో
పెండింగ్ ఉన్నందున తాజా పిల్ ను విచారణకు స్వీకరించడం లేదని తేల్చి చెప్పింది.
పిటిషన్
దారుడు పిల్ వేయడంతో హైకోర్టు కూడా నిరాకరించి ఉంటుందన్న ధర్మాసనం, దానికి బదులుగా
మరో రూపంలో కోర్టును ఆశ్రయిస్తే దానిని పరిశీలించే అవకాశముందని సూచించింది.
శ్రీకృష్ణుడి
జన్మభూమి మథుర లో షాహి ఈద్గా నిర్మించారని దానిని తొలిగించేలా ఆదేశాలు జారీ చేయాలని
అలహాబాద్ హైకోర్టులో న్యాయవాది మహేక్ మహేశ్వర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
చేశారు. దానిని గతఏడాది అక్టోబర్ 12
హైకోర్టు కొట్టివేసింది.
మసీదు
ఉన్న ప్రాంతం కృష్ణుడి జన్మభూమి అంటూ పలు
డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారు. అది మసీదు కట్టడం కాదు అని ఈ స్థలాన్ని బలవంతంగా
సేకరించి ఓ కట్టడాన్ని నిర్మించారని పిల్ లో పేర్కొన్నారు.
మధుర లోని 13.37 ఎకరాల్లోని శ్రీకృష్ణుడి
ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు షాహీ ఈద్గా మసీదు నిర్మించారని పలువురు
కోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్ మాన్ కు చెందినదిగా ప్రకటించాలని
కోరుతున్నారు.