భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ముందడుగు వేసింది. నూతన సంవత్సరం మొదటి రోజు అంతరిక్షంలో సీ58తోపాటు పంపిన ప్యుయల్ సెల్‌ను (isro fuelcell test success) విజయవంతంగా పరీక్షించింది. సెల్ పనితీరును విశ్లేషించి, డేటాను సేకరించారు. ప్యుయల్ సెల్ పరీక్ష విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భవిష్యత్తు మిషన్ కోసం ఈ సెల్ అభివృద్ధి చేసినట్లు ఇస్రో ప్రకటించింది.
రసాయన చర్య జరపడం ద్వారా ఈ సెల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులతో రసాయన చర్య జరపడం ద్వారా 180 వాట్ల విద్యుత్ విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన సంవత్సరం మొదటి రోజే ఇస్రో జరిపిన పీఎస్ఎల్వీ సీ 58 పరీక్ష విజయవంతం అయింది. తాజాగా ఎక్స్ రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు. ఇది మోసుకెళ్లిన పది పరికరాల్లో, ప్యుయల్ సెల్ కూడా ఉంది.
ఎక్స్ రే ఖగోళ శాస్త్రంలో పురోగతికి ఎక్స్ పో శాట్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైం డొమైన్ పరిశోధనలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.ఎక్స్ రే మూలాలను శోధించడం ఎక్స్ పో శాట్ లక్ష్యంమని ఇస్రో ప్రకటించింది.