తిరుమల
తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని అక్కడికి వచ్చే భక్తులకు
అందజేయాలని నిర్ణయించింది. 25 గ్రాముల బరువు ఉండే లక్ష లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు
టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమలలోని
అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి,
భక్తుల సందేహాలను నివృత్తి చేయడంతో సలహాలు స్వీకరించారు. సనాతన ధర్మ ప్రచారంలో
భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించేందుకు
ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ధునుర్మాసం
ముగింపు సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనం పరిధిలోని పరేడ్ గ్రౌండ్ లో శ్రీ గోదాదేవి
కళ్యాణం నిర్వహిస్తున్నట్లు వివరించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ కళ్యాణమహోత్సవం
ప్రారంభం అవుతుందన్నారు. జనవరి 16న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉంటుందన్నారు.
Ttdevasthanams.ap.
gov.in వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి
బుక్ చేసుకోవాలని సూచించారు.
ఇక
తిరుమలలో అధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 12న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేడు తణ్ణీరముదు ఉత్సవంతో ఈ ముగిశాయి.