Houthis Detonate
Boat In Red Sea
ఎర్ర
సముద్రంలో నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర చర్యలుంటాయని అమెరికా చేసిన హెచ్చరికలను హౌతీ(HOUTHIS) రెబల్స్ లెక్కచేయడం లేదు. ఎర్ర సముద్రంలో ఓ డ్రోన్ బోటును పేల్చారు.
ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
దాడులు నిలిపివేయాలంటూ అంతర్జాతీయ
కౌన్సిల్ ఇచ్చిన పిలుపును యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే హౌతీలు లెక్క
చేయడం లేదని అమెరికా నేవీ తెలిపింది. అమెరికా, జపాన్ సహా 12 దేశాలు సంయుక్త ప్రకటన
చేసిన మరుసటి రోజే హౌతీలు ఈ దాడికి పాల్పడ్డారు. ఆపరేషన్ ప్రాస్పెరిటీ పేరిట 22
దేశాలు కలిసి హౌతీల దాడుల నుంచి రక్షణ చర్యలు ప్రారంభించాయి.
గాజాలో
ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ నవంబరు 19
నుంచి ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో అంతర్జాతీయ రవాణాకు తీవ్ర ఆటంకం
ఏర్పడుతోంది. ఎర్ర సముద్రంలో ప్రయాణానికి బదులుగా ఆఫ్రికా చుట్టూ తిరిగి గమ్యాన్ని
చేరుకుంటున్నారు. దీంతో ప్రయాణ ఖర్చు భారీగా పెరిగింది. హౌతీ తిరుగుబాటుదారులు
ఇప్పటివరకు 25 నౌకలపై దాడులు చేశారు.
ఎర్ర
సముద్రంలో దాదాపు 80 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి
నౌకలు రద్దీగా ఉండే ప్రాంతంలో డ్రోన్ బోట్ పేలింది. నౌకల రాకపోకలతో రద్దీగా
ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని
అమెరికా నావికాదళాలకు చెందిన వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు.