అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) హరియాణాలో జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇంట్లో గురువారం నుంచి ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. ఈ సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం, వెండి, విదేశీ మద్యం, విదేశాల్లో తయారైన ఆరు తుపాకులు బయటపడ్డాయని ఈడీ తెలిపింది.
హరియాణా మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, ఆయన అనుచరులు, బినామీల ఇంట్లో రెండు రోజులుగా ఈడీ సోదాలు చేస్తోంది. ఈడీ సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో దిల్బాగ్ సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈడీ సోదాలు ప్రారంభించింది. తవ్వే కొద్దీ నగదు, బంగారం, ఆయుధాలు బయటపడటంతో ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.