Hindu Temple Defaced
అమెరికాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరోసారి
పేట్రేగిపోయారు. హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్న ఖలిస్తానీయులు,
కాలిఫోర్నియాలోని మరో హిందూ దేవాలయాన్ని గ్రాఫైట్ పెయింట్స్‌తో ధ్వంసం చేశారు.
హేవార్డ్ లోని విజయ్ షెరావాలి దేవాలయంపై గ్రాఫైట్ నినాదాలు రాసిన ఘటన తాజాగా
వెలుగులోకి వచ్చింది. దేవాలయ బోర్డు పై ‘మోదీ
టెర్రరిస్టు-ఖలిస్తానీ జిందాబాద్ ’ అని రాశారు.
కొన్ని
వారాల కిందట స్వామినారాయణ మందిరంపై కూడా ఇదే తరహా దాడి చేసి ఆలయ గోడలపై ఖలిస్తానీ
అనుకూల రాతలు రాశారు.
విజయ్
షెరావి దేవాలయ అధికారుల ఫిర్యాదు మేరకు
అల్మెడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఖలిస్తానీ
వేర్పాటువాదుల చర్యను హిందూ అమెరికన్
ఫౌండేషన్(HAF) సోషల్ మీడియా వేదికగా ఖండించింది. ఆలయ భద్రత కోసం సెక్యూరిటీ కెమెరాలతో పాటు అలారం
సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలని దేవాలయ కమిటీలకు హెచ్ఏఎఫ్ సూచించింది. హిందూ
విద్వేషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కాలిఫోర్నియా
రాష్ట్రం నెవార్క్ లోని స్వామి నారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు
గీయడంతో పాటు భారత్ వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ దుశ్చర్యపై పోలీసులు కేసు నమోదు
చేసి దర్యాప్తు చేస్తున్నారు.