గూఢచర్యం ఆరోపణలపై అరెస్టై జైలు జీవితం గడుపుతోన్న 8 మంది భారతీయులకు ఖతర్ (foreign affairs) మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే మరణశిక్షను, జైలు శిక్షగా మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పీలు చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గత ఏడాది డిసెంబరు 28న ఖతర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు వెలువరించింది. మరణ శిక్షను జైలు శిక్షగా మార్చింది. జైలు శిక్షపై కూడా అప్పీలుకు అవకాశం కల్పించారు.
ఈ కేసు త్వరలో ఖతర్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట విచారణకు వస్తుందని భారత విదేశాంగ శాఖ రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు.భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులపై గూడఛర్యం కింద ఖతర్ అరెస్ట్ చేసింది. ముందుగా వారికి మరణశిక్ష విధించింది. భారత విదేశాంగ శాఖ న్యాయపోరాటం చేయడంతో అక్కడి కోర్టు మరణ శిక్షను జైలు శిక్షగా మార్చింది. జైలు శిక్షపై కూడా న్యాయపోరాటానికి భారత విదేశాంగశాఖ అధికారులు సిద్దమవుతున్నారు.