దిల్లీ
సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్, ఈడీ విచారణకు డుమ్మా కొట్టడంతో పాటు రాజకీయ ప్రోద్బలంతో
తన అరెస్టుకు కుట్ర జరుగుతుందని ఆరోపించడాన్ని బీజేపీ తిప్పికొడుతోంది. ఆప్ తీరును
ప్రజాక్షేత్రంలో బీజేపీ నేతలు ఎండగడుతున్నారు.
బీజేపీ
దిల్లీ చీఫ్ వీరేంద్ర సచేద్వా మరోసారి కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగించారు. అవినీతి,
అక్రమాలకు పాల్పడిన కేజ్రీవాల్ అరెస్టు ఖాయమని వ్యాఖ్యానించిన వీరేంద్ర,
ఆప్
చేష్టలను చోరోం కీ బారాత్ (దొంగల ఊరేగింపు)తో పోల్చారు.
కేజ్రీవాల్
కు అనుకూలంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను తప్పుబట్టిన వీరేంద్ర సచేద్వా,
ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడి ఇప్పుడు బాధపడటం ఎందుకుని దెప్పిపొడిచారు.
దర్యాప్తు
సంస్థలు మూడు సార్లు నోటీసులు జారీ చేసినా ఎందుకు విచారణకు హాజరు కాలేదని
ప్రశ్నించారు. నిజంగా తప్పు చేయకపోతే ఆ విషయాన్ని నిరూపించుకోలేరా అని నిలదీశారు. దిల్లీ
మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర లేకపోతే, విచారణ సంస్థలకు ఎందుకు సహకరించడం
లేదన్నారు.
కేజ్రీవాల్
కు ఈడీ నోటీసుల విషయంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఈడీ విచారణకు హాజరై ఆరోపణలకు
తగువిధంగా బదులివ్వాలని కేజ్రీవాల్ కు కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ సూచించారు. సోనియా,
రాహుల్ గాంధీలు గతంలో ఈడీ విచారణకు హాజరైన విషయాన్నిగుర్తు చేశారు. ఈడీని
దుర్వినియోగం చేస్తున్నారని పునరుద్ఘాటించిన ఉదిత్ రాజ్, విచారణకు హాజరై తన పై వస్తున్న ఆరోపణలు తప్పు
అని నిరూపించుకోవాలన్నారు. అప్పుడే కేజ్రీవాల్ తన
ఇమేజ్ను
కాపాడుకోగల్గుతారని అభిప్రాయపడ్డారు.
మద్యం
కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన తాఖీదులపై స్పందించిన కేజ్రీవాల్, విచారణ పేరుతో
తనను అరెస్టు చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు
చేయకపోయినప్పటికీ మద్యం కుంభకోణం పేరిట బీజేపీ తన పై అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా కట్టడి చేసే పన్నాగంలో భాగంగానే నోటీసులు
జారీ చేశారని భాష్యం చెప్పారు.
కేజ్రీవాల్‌ను
అరెస్టు చేయబోతున్నారంటూ ఆప్ చేసిన ఆరోపణలపై ఈడీ స్పందించింది. మరోసారి నోటీసులు
జారీ చేసి చట్టపరంగా ముందుకెళ్తామని వివరించింది.