ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి (cm ys jaganmohanreddy) తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. తెలంగాణ ఎన్నికల తరవాత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌసులో జారిపడ్డ సంగతి తెలిసిందే. ఆయనకు నెల కిందట తుంటి ఆపరేషన్ చేశారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో ఉంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇవాళ కేసీఆర్‌ను కలసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకున్న జగన్మోహన్రెడ్డి నేరుగా నందినగర్ వెళ్లారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు.
కేసీఆర్‌ను పరామర్శించిన జగన్మోహన్రెడ్డి, అక్కడి నుంచి లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.