Annapoorani
: A soft Jihadi Propaganda Film
కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాల
గురించి కమ్యూనిస్టులు, ముస్లిములు, సెక్యులర్ వాదులు నానా రచ్చా చేసారు.
ప్రాపగాండా సినిమాలు తప్ప వాటిలో ఇసుమంతైనా నిజం లేదంటూ మండిపడ్డారు. హిందువులను
ఊచకోత కోడం, వారిని బలవంతంగా మతం మార్చడం, కొన్నిసందర్భాల్లో వారిని బలవంతంగా
ఉగ్రవాదులను చేయడం… పచ్చి అబద్ధాలంటూ విరుచుకుపడిపోయారు. కానీ ఇప్పుడు
అన్నపూర్ణి సినిమా విషయంలో ఒక్కళ్ళూ నోరు మెదపడం లేదు.
భారత సినిమా చరిత్ర మొదలైనప్పటినుంచీ
హిందువులను మూర్ఖులుగా అపహాస్యం పాలు చేయడం, దుర్మార్గులుగా చిత్రీకరించడం
సర్వసాధారణం. ముస్లిం లేదా క్రైస్తవ పాత్రలు ఉంటే వారిని మాత్రం ఉదాత్తులుగా చూపడం
ఆనవాయితీ. హిందూ ముస్లిం పాత్రలు రెండూ ఉండే సందర్భాల్లో హిందువులు ఛాందసులుగానూ,
ముస్లిములు ఉదారవాదులుగానూ చూపడం షరామామూలు. హిందువుల ఆచార సంప్రదాయాలను అవహేళన
చేయడం.. ఇతర మతస్తుల సంప్రదాయాలను గొప్పవిగా చూపడం బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ
అన్నిచోట్లా కనిపించే పద్ధతి.
నిజమైన భారత చరిత్రను వక్రీకరించి
మొగలులు గొప్ప రాజులు, మహాగొప్ప ప్రేమికులు అన్నట్లు చిత్రించిన సినిమాలు
అజరామరాలు. పొరుగింటి హిందువులను తామే హింసించి, తామే పట్టించి చంపించిన నిజమైన కశ్మీర్
చరిత్రను చూపిన కశ్మీర్ ఫైల్స్ మాత్రం ప్రాపగాండా చిత్రం. ఇలా ఉంటుంది
సెక్యులరిస్టు కమ్యూనిస్టు యాంటీ హిందూ చలనచిత్రాల ప్రచారం.
అటువంటి పరంపరలోనిదే తాజాగా తెలుగులో
అందుబాటులోకి వచ్చిన తమిళ చిత్రం అన్నపూరణి (Annapoorani). ఇది పక్కా ఇస్లామిక్ జిహాదీ
ప్రాపగాండా (Islamic Jihadi Propaganda Film) సినిమా. దేవాలయానికి ప్రసాదాలు, నైవేద్యాలూ చేసే బ్రాహ్మణ కుటుంబంలో
పుట్టిన కథానాయిక చెఫ్ కావాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తల్లిదండ్రులను
ధిక్కరిస్తుంది. వారిని మోసం చేసి కుజిని కోర్స్‌లో చేరుతుంది. మాంసాహారం తింటుంది.
తల్లిదండ్రులు పెళ్ళి నిర్ణయించిన రోజున ఒక ముస్లిం యువకుడితో వెళ్ళిపోతుంది.
అతన్ని పెళ్ళి చేసుకుని ఇస్లాంలోకి మారిపోతుంది. ముస్లింగా బురఖా కట్టుకుని నమాజు
చేసి బిరియానీ వండుతుంది. మాస్టర్ ఛెఫ్ పోటీలో విజయం సాధిస్తుంది. ఇదీ స్థూలంగా
సినిమా కథ.
కొత్త దర్శకుడు నీలేష్ కృష్ణ తన మొదటి
సినిమాతోనే తన హిందూ ద్వేషాన్ని అడుగడుగునా ప్రదర్శించాడు. హిందువుల కంటిని వారి
వేలితోనే పొడిపించాలన్న నీతిని అణువణువునా పాటించాడు. హిందువులు సంకుచిత భావాలు
కలిగినవారు, ముస్లిములు విశాలదృష్టి గలవారు అని ఉపదేశించాడు. శాకాహారం తినడం సంకుచిత
మనస్తత్వం మాత్రమే అని హిందువులకు జ్ఞానబోధ చేసాడు. మంచి వంటమనిషిగాగుర్తింపు
తెచ్చుకోవాలంటే సంకుచితంగా హిందూ పూజలను చెయ్యకూడదు, నమాజునే తప్పనిసరిగా చేసి తీరాలి, అదే విశాల
దృక్పథం అని హితవు పలుకుతాడు. ఈ సినిమా, సమాజంలోని బ్రాహ్మణులందరూ శాకాహారమనే
మూఢనమ్మకాన్ని వదిలి మాంసాహారులై నమాజు చేస్తే అల్లా సంతోషిస్తాడనీ, దానికోసమే
అందరూ హిందూ ఛాందస భావాలను వదిలిపెట్టి ఇస్లాం అనే విశాలధృక్పదాన్ని అలవరచుకోవాలని
మెల్లమెల్లగా ఎక్కిస్తుంది. అమ్మోరుతల్లి సినిమాలో సినిమాపాటలు పాడే దేవీమూర్తిగా హిందువుల మూఢాచారాలను దునుమాడిన నయనతారకు (Nayanathara) కథానాయికగా ఇది 75వ చిత్రం.
హిందూ బ్రాహ్మణ అమ్మాయి ముస్లింగా మతం మారి, బురఖా
చుట్టుకుని మాంసాహారం వండితేనే విశాల భావజాలం కలిగినవారవుతారంటూ ప్రచారం చేసే ఇలాంటి
సినిమాలు ప్రాపగాండా సినిమాలు కావు. ఉదారవాద దృక్పథంతో హిందువులను ఉద్ధరించే
సినిమాలు… అని వారు చూపిస్తుంటారు, వాటిని మనం నమ్మాలి.
ఈ సినిమా చూసాక కలిగే సందేహం ఒకటే… బురఖా
తొడుక్కున్న యువతి తన మతాచారాలను వ్యతిరేకించి బైటకు వచ్చి చెఫ్ కోర్స్ చేసి,
పందిమాంసం వండి దాన్ని తను రుచిచూసి తన ఇంట్లోని వాళ్ళను మెప్పించగలదా? ఆ
ఇతివృత్తంతో సినిమాను తీసి ఉంటే డైరెక్టర్ బతుకు ఏమవుతుందో ఊహించడానికి పెద్ద కష్టపడక్కర్లేదు.
లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్‌ను
స్లోపాయిజన్‌లా సమాజంలోకి ఎక్కించే వందలాది సినిమా ప్రయత్నాల్లో తాజా కాలకూట విషం
అన్నపూరణి.