మాజీ మోడల్ దివ్య పహుజా హత్య గురుగ్రామ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ నకిలీ ఎన్కౌంటర్ కేసులో నిందితురాలిగా ఉన్న దివ్య పహుజా ఇటీవలే బెయిపై విడుదలైంది. మాజీ ప్రియుడు అభిజీత్ షింగ్, మాట్లాడాలంటూ పిలిచి రాత్రి హోటల్‌కు తీసుకెళ్లి దివ్యను హత్య (delhi crime news) చేసినట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని తరలిస్తున్న సమయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో దిగిన కొన్ని అశ్లీల ఫోటోలను చూపించి డబ్బు డిమాండ్ చేస్తోందని అందుకే హత్య చేసినట్లు అభిజీత్ సింగ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
అభిజీత్ సింగ్ ఆరోపణలను దివ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దివ్య మృతదేహాన్ని గుడ్డలో చుట్టి ఈడ్చుకెళుతోన్న దృశ్యాలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా స్వాధీనం చేసుకున్నారు. దివ్య శవాన్ని మాయం చేసేందుకు అభిజీత్ సింగ్ హోటల్ సిబ్బందిని పురమాయించాడని పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలో వారు పోలీసులకు దొరికిపోయారు.
2016 ఫిబ్రవరి 6న ముంబైలో జరిగిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ గడోలీ హతమయ్యాడు. అది నకిలీ ఎన్కౌంటర్ అని ముంబై పోలీసులు ప్రకటించారు.గడోలీ స్నేహితురాలు దివ్య సాయంతో అతన్ని ఉచ్చులోకి లాగి చంపేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏడేళ్ల జైలు జీవితం తరవాత దివ్య ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి మాజీ ప్రియుడి చేతిలో బలైంది.