Chhattisgarh govt declares dry day on jan 22
ఛత్తీస్గఢ్
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ
ప్రాణప్రతిష్ట సందర్భంగా డ్రై డే గా ప్రకటించింది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్
ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్వయంగా వెల్లడించారు.
రాయ్పూర్
లో మీడియాతో మాట్లాడిన సీఎం విష్ణుదేవ్ శాయి, శ్రీరాముడి అమ్మమ్మ తాతలది తమ ప్రాంతకావడం అదృష్టంగా
భావిస్తున్నామన్నారు. చాంద్ఖురీ కౌసల్యాదేవి జన్మస్థలమని అక్కడ ఆమె ఆలయం ఉండటం
అందుకు సాక్ష్యమని స్థానికులతో పాటు చరిత్రకారులు చెబుతున్నారు.
అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవంలో తమ వంతు బాధ్యతగా రాష్ట్రంలో జనవరి 22న మద్యం విక్రయాలపై
నిషేధం విధించినట్లు తెలిపారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు పరమ
పవిత్రమైనదని, ఆరోజున దీపావళి వలే ప్రతీ ఇంట్లో దీపాలు వెలగించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని పండుగ వాతావరణం నెలకొంటుందని దానిని మరింత ప్రస్ఫుటం చేసేందుకే జనవరి
22ను డ్రైడే గా ప్రకటించామన్నారు.
మూడు
వేల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే అయోధ్య పంపిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కూరగాయలు
కూడా పంపేందుకు సిద్ధమైంది. వనవాస సమయంలో శ్రీరాముడు ఛత్తీస్గఢ్ లో సంచరించాడనే
కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.