BJP On Kejriwal
Evading Summons
దిల్లీ
ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ
మరోసారి
నిలదీసింది. అరెస్టు భయంతో వణికిపోతున్న కేజ్రీవాల్, ఈడీ విచారణకు కూడా అందుకే
డుమ్మాకొట్టారని దుయ్యబట్టారు. దిల్లీ లిక్కర్ పాలసీ సూత్రధారి అతడే కాబట్టి అంతగా
కలవరం చెందుతున్నాడేమోనని బీజేపీ దెప్పిపొడిచింది.
ఈడీ
విచారణకు గైర్హాజరు కావడంతో పాటు విచారణే అక్రమమని ఆప్ పేర్కొనడాన్ని భారతీయ జనతా
పార్టీ తప్పుబట్టింది. ఎన్నికల వేళ తనపై కక్ష సాధిస్తున్నారని చేసిన ప్రకటనపై
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దిల్లీలోని
పార్టీ జాతీయ కార్యాలయంలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా,
అరవింద్ కేజ్రీవాల్ తీరును తూర్పారబట్టారు.
అవినీతిపరుడు, పాపాత్ముడైన అరవింద్
కేజ్రీవాల్ అరెస్టుభయంతో వణికిపోతున్నారని అందుకే కుంటి సాకులు చెబుతూ ఈడీ విచారణ
నుంచి తప్పించుకుంటాన్నారని విమర్శించారు. కేజ్రీవాల్ పై విమర్శలు చేసేందుకు తానేం
సంకోచించడం లేదన్న భాటియా, అతడి అరెస్టు సమయం ఆసన్నమైందన్నారు. ఆ విషయం కేజ్రీవాల్
కు కూడా తెలుసని అందుకే చట్ట ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు పన్నాగం
పన్నుతున్నారని చురకలు అంటించారు.
తాఖీదులు
వెనక్కి తీసుకోవాలని దర్యాప్తు సంస్థలను నిందితులు ఆజ్ఞాపించడం స్వతంత్ర భారత
చరిత్రలో మొదటిసారన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకునే అధికారం దర్యాప్తు
సంస్థలకు ఉందన్నారు. కేజ్రీవాల్ చట్టానికీ అతీతుడేం కాదనే విషయాన్ని గుర్తెరిగి
విచారణ సంస్థల పట్ల అభిప్రాయాన్ని
మార్చుకోవాలని హితవు పలికారు.
రాజకీయ కుట్రలో భాగంగానే నోటీసులు అందాయని
భావించినప్పుడు కోర్టుకు వెళ్ళి ఊరట ఎందుకు పొందలేకపోతున్నారని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ కు తోలుబొమ్మలుగా వ్యవహరించిన సిసోడియా, సంజయ్
సింగ్ జైలు ఊచలు లెక్కబెడుతున్నారని ఇక కేజ్రీవాల్ కు సంకెళ్ళు పడటం ఖాయమన్నారు.
అవినీతి, మోసం, అబద్ధాలు ప్రచారంలో చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ దిట్ట అని
ఆరోపించిన బాటియా, తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారన్నారు.
ఈ పరిణామంపై
ఇండీ కూటమి నిశబ్ధం పాటించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థలకు ప్రధాని మోదీ
పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అక్రమార్కలు,
లంచగొండుల పై విచారణ ముమ్మరంగా జరుగుతుందన్నారు. ప్రజాల కష్టార్జితాన్ని గద్దల్లా
కాజేస్తున్నవారిపై చర్యలు తప్పవన్నారు.