టీడీపీ, వైసీపీ పాలనలో
ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు మాత్రమే మిగిలాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంపై రూ. 3 లక్షల కోట్ల అప్పుభారం మోపితే, పాలకపార్టీగా
వైసీపీ అవతరించిన తర్వాత ఆ
అప్పులను రూ. 12 లక్షల కోట్లకు పెంచిదన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేసే ప్రతీపథకం వెనుక ఓ కుంభకోణం ఉందని దానిని ప్రజలకు
వివరించాలని బీజేపీ శ్రేణులకు పురందరేశ్వరి సూచించారు. విజయవాడలో జరిగిన పార్టీ
పదాధికారులు సమావేశంలో పాల్గొన్న పురందరేశ్వరి, ఏపీలో బటన్ నొక్కడం మాటున
జరుగుతున్న అక్రమాలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. రైతుల కోసం సీఎం జగన్
ఏం చేశారో చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు.
దిశ
యాప్ పేరిట ఆర్భాటపు ప్రచారానికి పాల్పడిన సీఎం జగన్ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం
లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా
విఫలమైందన్నారు.
పెట్టుబడులు
రాకపోవడంతో పాటు ఉన్న పరిశ్రమలు తరలిపోవడంతో యువతకు ఉపాధి దొరకడం లేదన్నారు. ఎస్సీ
రిజర్వుడు స్థానాల్లో పెద్దిరెడ్డి లాంటి నేతల పెత్తనం ఎందుకు అని ప్రశ్నించారు.
ప్రపంచ
వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతి ప్రధాని నరేంద్ర మోదీ వల్లే పెరిగిందన్నారు. ఎన్నికల
సమాయత్తతలో భాగంగా నేడు, రేపు సమావేశాలు నిర్వహించి ప్రార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం
చేస్తోనట్లు చెప్పారు. దేశంలో ఎక్కడి ఎన్నికల జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతోందన్న
పురందరేశ్వరి, కొన్ని చోట్ల అధికారం పంచుకుంటుదన్నారు.
కేంద్ర
పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పధకాలుగా చెప్పుకుంటుందని దానిని ఖండించాల్సిన అవసరం
ఉందన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర పథకాల గురించి ప్రజలకు
వివరించే అవకాశం దొరికిందన్నారు.
కార్యక్రమంలో జాతీయ
సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు.