Arvind Kejriwal
Skips ED
Summons
దిల్లీ
ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)అధినేత
అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. దిల్లీ లిక్కర్ పాలసీలో
అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తునకు సహకరించాలని విచారణకు హాజరు కావాలని ఈడీ
ఇప్పటికే మూడు సార్లు తాఖీదులు జారీ చేసింది. వాటిని ఏ మాత్రం లెక్క చేయని కేజ్రీవాల్ నేటి
విచారణకు హాజరు కాలేదు.
ఈ అంశంపై కేజ్రీవాల్ బదులు ఆప్ పార్టీ వివరణ
ఇచ్చింది. ఈడీ నోటీసులు అక్రమమని
పేర్కొన్న ఆప్, తమ పార్టీ నేషనల్ కన్వీనర్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదని తేల్చి
చెప్పింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేసే ఉద్దేశంతో ఈడీ వ్యవహరిస్తోందని ఆప్
ఆరోపించింది.
నవంబర్
2, డిసెంబర్ 21న కూడా ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.
విచారణకు సహకరించేందుకు
కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తోన్న తీరు సరిగాలేదని
ఆరోపించిన ఆప్, కేవలం తమ అధినేతను అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే తాఖీదులు
పంపుతున్నారని మండిపడింది. ఎన్నికల
సమీపిస్తోన్న తరుణంలో కేజ్రీవాల్ ను ప్రచారానికి దూరం చేసే కుట్రతోనే నోటీసుల డ్రామా
ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిల్లీ
మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ఇప్పటికే విచారించింది.
ఏప్రిల్ లో ఆయనను దాదాపు 9 గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈడీ
నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి
చెందిన పలువురు ముఖ్యనేతలు ఈ కుంభకోణం కేసులో జైలుపాలయ్యారు. గత ఏడాది ఫ్రిబవరిలో
డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా అరెస్టు కాగా, అక్టోబర్ లో ఎంపీ సంజయ్ సింగ్ ను
కస్టడీలోకి తీసుకున్నారు.