Bhavani
Deeksha Viramana :
భవానీ
మాలధారులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో భవానీలు కనకదుర్గమ్మను
దర్శించుకుంటున్నారు. అమ్మలగన్న మాయమ్మ
దుర్గమ్మ, జై దుర్గా భవానీ అంటూ అమ్మవారిని స్మరిస్తున్నారు. జగన్మాత స్మరణతో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
మార్మోగుతోంది.
నేటి
ఉదయం 6 గంటల 15 నిమిషాలకు అగ్నిప్రతిష్టాపన అనంతరం దర్శనానికి భవానీలకు అనుమతించారు.
గిరి
ప్రదక్షిణ చేస్తోన్న భవానీలు, వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో ప్రవేశించేందుకు
వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇరుముడిని
దుర్గమ్మకు సమర్పించిన తర్వాత మల్లేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గం ద్వారా మహామండప
ప్రాంగణానికి చేరుకునిు. తర్వాత హోమగుండాల్లో నేతికొబ్బరికాయ సమర్పిస్తున్నారు. ఈ
నెల ఏడో తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల
మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు.
సీతమ్మ
వారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ లలో కేశఖండన శాల ఏర్పాటు చేశారు. ఏడో తేదీ పూర్ణాహుతితో దీక్షల విరమణ కార్యక్రమం
ముగియనుంది. భవానీ దీక్షలు, భక్తులు రద్దికీ తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్లు ఈవో
రామారావు తెలిపారు.
భవానీల రాక సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా
పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ వాహనాలను దారి మళ్ళిస్తున్నారు.