భారత
మహిళల జట్టు, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో పూర్తిగా విఫలమైంది. మూడు
వన్డేల్లోనూ ఓటమి చెందడంతో సిరీస్ ను ఆస్ట్రేలియా మహిళల జట్టు 3-0తో కైవసం
చేసుకుంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు, భారత జట్టుపై 190
పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్
నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి
338 పరుగులు చేసింది.
లక్ష్య
ఛేదనలో భారత్ పూర్తిగా విఫలమైంది.32.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. జార్జియా
వేర్హామ్ మూడు వికెట్ల పడగొట్టగా, అలానా కింగ్ రెండు వికెట్లు తీసి భారత్ ను
కోలుకోలేని దెబ్బ కొట్టారు.
స్మృతి
మంధాన మాత్రమే 29 పరుగులతో టాప్ స్కారర్ గా నిలిచారు. ఓపెనర్లు స్మృతి, యాస్తిక(6),
తొలి వికెట్ కు 32 పరుగులు చేశారు. జెమియా, దీప్తి శర్మ చెరో 25 పరుగులు చేశారు.
ఆద్భుతంగా
ఆడిన లిచ్ఫీల్డ్ ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’
అవార్డులు వరించాయి.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు తదుపరి
ఫార్మెట్ లో భాగంగా టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 5,7,9 తేదీల్లో మూడు మ్యాచుల
సిరీస్ జరగనుంది. నవీ ముంబై వేదికగా ఈ సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్ కు ముందు
జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది.