BHARAT W VS AUSW, 3rd ODI
ముంబై
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50
ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 338 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ను
ఇప్పటికే 2-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో వన్డేలో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా,
భారత్ జట్టు ముందు 339 భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబే లిచ్ ఫీల్డ్ 125
బంతుల్లో 119 పరుగులు చేసి వన్డే ల్లో రెండో శతకం నమోదు చేసింది. దీప్తిశర్మ ఆమెను
ఔట్ చేసింది. మరో ఓపెనర్ హేలీ కూడా అద్భుతంగా ఆడింది. 95 బంతుల్లో 82 పరుగులు చేసి
పూజా వస్త్రాకర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరింది. 189 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి
వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఎలీస్
ఫెర్రీ(16), బెత్ మూనీ(3), తహిలా మెక్‌గ్రాత్ (0) విఫలమైనప్పటికీ ఆ తర్వాతి వారు ధాటిగా ఆడి స్కోర్ బోర్డు ను
పరుగులు పెట్టించారు. అన్నాబెల్
సదర్లాండ్( 21 బంతుల్లో 23), అలానా కింగ్(14 బంతుల్లో 26*), ఆష్లే గార్డినర్ (30), జార్జియా (11*) కదం తొక్కడంతో ఆస్ట్రేలియా టీమ్ 338 పరుగులు చేసింది.
భారత
బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మూడు వికెట్లు
తీయగా, అమన్‌జోత్ కౌర్ 2 వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో
ఒక వికెట్ పడగొట్టారు.
భారత్
ఇన్నింగ్స్ ను యస్తికా బాటియా, స్మృతి మంధన్నా ప్రారంభించారు. మూడు ఓవర్లలో 24 పరుగుల
భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.