Those three awarded
Bharat Ratna for themselves
భారతదేశపు అత్యున్నత పురస్కారాలు భారతరత్న
(Bharat Ratna), పద్మ అవార్డులను (Padma
Awards) 1954లో జనవరి 2న ప్రవేశపెట్టారు. దేశపు మొదటి
రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ (Dr
Rajendra Prasad) ఈ పురస్కారాలను
ప్రారంభించారు. కళలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు, సమాజసేవ, క్రీడల రంగాల్లో
ప్రతిభ చూపి దేశానికి సేవ చేసిన, దేశం కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన పౌరులను
సన్మానించడమే ఆ పురస్కారాల ప్రధాన ఉద్దేశం.
భారతరత్న దేశపు అత్యున్నత పురస్కారం.
దాని తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్,
పద్మశ్రీ వరుసగా ప్రదానం చేస్తారు. భారతరత్న పురస్కారాన్ని మొదటి యేడాది ముగ్గురు
మహామహులు చక్రవర్తుల రాజగోపాలాచారి
(Ch Rajagopalachari), సర్వేపల్లి
రాధాకృష్ణ పండితుడు (Sarvepalli
Radhakrishnan), సి.వి రామన్‌లకు (CV Raman) ప్రదానం చేసారు. మొదట్లో ఈ పురస్కారాన్ని మరణానంతరం ఇచ్చే పద్ధతి
లేదు. 1955లో ఆ వెసులుబాటు కల్పించారు.
భారతరత్న ప్రారంభించిన రెండో యేడాదే అంటే
1955లో అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జవాహర్లాల్ నెహ్రూకు (Jawahar Lal Nehru) భారతరత్న పురస్కారం లభించింది. అలా, కేవలం 1955లో మాత్రమే జరగలేదు.
1971లో ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ (Indira Gandhi) కూడా భారతరత్న పురస్కార గ్రహీత అయారు. గాంధీ కుటుంబంలో భారతరత్న
పొందిన మూడో వ్యక్తి రాజీవ్‌గాంధీ
(Rajiv Gandhi). ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరూ గద్దె
ఎక్కలేకపోయారు. అందువల్ల, ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరికీ భారతరత్న రాలేదు.
1955లో భారతరత్న పురస్కారం జవాహర్లాల్
నెహ్రూకు ఇచ్చినప్పుడు అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు నెహ్రూతో సత్సంబంధాలు
లేవు. వాళ్ళిద్దరి మధ్యనా ఎన్నో విషయాల్లో అభిప్రాయభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ
రాజేంద్రప్రసాద్, నెహ్రూకు భారతరత్న ఇచ్చిన పూర్తి బాధ్యత తీసుకున్నారు.
ఆ విషయమై 15 జులై 1955న డా.
రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. ‘‘ఇది నాకు నేనుగా, పూర్తి స్వయంబుద్ధితో,
ప్రధానమంత్రి అనుమతి లేకుండానే, ఆయన సలహా తీసుకోకుండానే, తీసుకున్న నిర్ణయం.
కాబట్టి దాన్ని రాజ్యాంగబద్ధం కాదనవచ్చు. కానీ నా నిర్ణయాన్ని ప్రజలు ఉత్సాహంగా ఆమోదిస్తారని
నాకు తెలుసు’’ అని ఆయన స్పష్టం చేసారు.
ఆ నేపథ్యంలో 2014 తర్వాత పరిస్థితి చూస్తే,
దేశంలో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచీ దేశ
సర్వోన్నత పురస్కారాలు ఈ దేశపు సాధారణ ప్రజలకు ప్రకటించడం జరుగుతోంది.
మొట్టమొదటిసారి క్రీడారంగంలో ఒక ఆటగాడికి భారతరత్న పురస్కారం లభించింది. క్రికెట్
చరిత్రలో ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మ్యాన్‌గా పేరు గడించిన సచిన్ తెందుల్కర్‌కు (Sachin Tendulkar) 2014లో భారతరత్న పురస్కారం ప్రదానం చేసారు. దేశ అత్యున్నత పురస్కారం
క్రీడారంగంనుంచి ఒక క్రీడాకారుడికి ప్రకటించడం దాదాపు 6 దశాబ్దాల తర్వాత అదే
మొదటిసారి. ఇంకో విశేషం ఏంటంటే, భారతరత్న గ్రహీతలు అందరిలోకీ పిన్నవయస్కుడు సచిన్
తెందుల్కరే.
2015లో భారతరత్న అవార్డును దేశంలో అత్యంత
ప్రభావశీలమైన రాజకీయ నేతగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీకి (Atal Bihari Vajpayee) ప్రదానం చేసారు. అంతకు ముందు 1999-2000లో వాజ్‌పేయీ ఆ పురస్కారం తనకు
వద్దని స్పష్టం చేసారు. 1999లో కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత వాజ్‌పేయీకి
భారతరత్న గౌరవం లభించాలని దేశంలోని ప్రముఖ నాయకులందరూ భావించారు. ఆయనకు ముందు
జవాహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తాము ప్రధానమంత్రులుగా ఉండగానే తమకు భారతరత్న
ఇప్పించుకున్నారనీ, ఆయన కూడా అదే పని చేయాలనీ చాలామంది వాజ్‌పేయీకి చెప్పారు కూడా.
ఆ విషయం విన్న తర్వాత ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా వాజ్‌పేయీ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.
2015లో వాజ్పేయీతో పాటు ‘మహామనా’ మదన్
మోహన్ మాలవీయకు (Madan Mohan
Malviya) కూడా దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఆయనను
యుగపురుషుడిగా భావిస్తారు. భారతీయ జ్ఞానసంపదకు, సాంస్కృతిక వికాసానికి ప్రతిరూపంగా
పరిగణిస్తారు. ఆయనను ‘మహామనా’ (మహామనీషి) అనే గౌరవప్రదమైన పిలుపుతో వ్యవహరించింది గాంధీ.
అంతేకాదు, ఆ బిరుదనామంతో ఖ్యాతికెక్కిన మొదటి, చివరి వ్యక్తి మాలవీయ ఒక్కరే. ఆయన
1906 నుంచి 1918 వరకూ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయన 1946లో
కాలం చేసారు. ఆయన మరణానంతరం 68 ఏళ్ళ తర్వాత, ఆయన 125వ జయంతికి కొద్ది ముందుగా
భారతరత్న పురస్కారం ప్రకటించారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన
కుటుంబీకులకు ఆ పురస్కారాన్ని అందజేసారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం
ఆ మహానుభావుడిని ఆ విధంగా సత్కరించుకుంది.
తర్వాత 2019లో భారతదేశానికి 13వ
రాష్ట్రపతిగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీకి (Pranab Mukherjee) భారతరత్న పురస్కారం
ప్రదానం చేసారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరు. దేశానికి
ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గాను, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ
ప్రభుత్వం దేశపు అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.
అదే సంవత్సరం ఈశాన్య భారతదేశపు బహుముఖ
ప్రజ్ఞాశాలి – గీతరచయిత, సంగీతవేత్త, గాయకుడూ అయిన భూపేన్ హజారికాకు (Bhupen Hazarika) కూడా భారతరత్న పురస్కారం లభించింది. ఆయన విలక్షణ కళాకారుడు. తన పాటలు
తనే రాసుకుంటారు, వాటికి స్వరాలు సృజిస్తారు, వాటిని ఆయనే పాడుతారు. ఆయన కవిత్వ
రచన, పత్రికా విలేఖనం, గానం, చిత్రనిర్మాణం వంటి అనేక రంగాల్లో కృషి చేసారు. ఆయన
2011లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న పురస్కారం మరణానంతరం 2019లో లభించింది.
ఈ దేశపు అత్యున్నత పౌర పురస్కారం 2019లో
నానాజీ దేశ్‌ముఖ్‌కు (Nanaji
Deshmukh) కూడా ప్రకటించారు. అంతకుముందు 1999లో నానాజీ దేశ్‌ముఖ్‌ను
పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు. ఆ సందర్భంలో అప్పటి రాష్ట్రపతి ఎపిజె
అబ్దుల్ కలామ్, నానాజీ దేశ్‌ముఖ్ తన సంస్థ దీనదయాళ్ శోధ్ సంస్థాన్ ద్వారా
చేస్తున్న సమాజ సేవను ప్రశంసించారు. ఆ సంస్థ వందలాది పల్లెటూళ్ళను ఆదర్శగ్రామాలుగా
తీర్చిదిద్దింది. నానాజీ దేశ్‌ముఖ్ చిత్రకూట్ ప్రాంతంలో అదే పేరుతో గ్రామోదయ
విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయం అదే.
దానికి మొట్టమొదటి వైస్‌ఛాన్సలర్‌గా ఆయనే ఉన్నారు. నానాజీ దేశ్‌ముఖ్ తన జీవితం
మొత్తాన్నీ దేశసేవకే అంకితం చేసేసుకున్నారు.
ఇప్పటివరకూ ఇద్దరు
భారతీయేతరులకు కూడా ఆ పురస్కారం లభించింది. భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న
పాకిస్తానీ పౌరుడు, సరిహద్దు గాంధీగా వాసికెక్కిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు (Khan Abdul Gafar Khan) 1987లోనూ, ఆ తర్వాత
దక్షిణాఫ్రికాకు మొట్టమొదటి నల్లజాతి రాష్ట్రపతిగా పనిచేసిన నెల్సన్ మండేలాకు (Nelson Mandela) 1990లోనూ భారతరత్న గౌరవం
దక్కింది.