జపాన్ రాజధాని టోక్యోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 400 మందితో కూడిన విమానం ప్రమాదంలో (japan Plane Fire accident ) కాలిబూడిదైంది. 379 ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బందితో కలపి మొత్తం విమానంలో 400 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారని సమాచారం అందుతోంది.
400 మంది ప్రయాణీకులతో కూడిన జేఎల్ 516 విమానం, టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయంలో పక్కగా నిలిపి ఉంచిన కోస్టుగార్డు విమానాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. రెండు విమానాల్లో ఇంధన ట్యాంకులకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ ఫైర్ సిబ్బంది, ప్రయాణీకులను రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.