PM Modi unveil major development projects
దేశ
సర్వతో ముఖాభివృద్ధి నమూనాతో ముందుకెళుతోన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం,
దక్షిణ భారతదేశ అభివృద్ధి కోసం విరివిగా నిధులు కేటాయిస్తోంది. గడిచిన పదేళ్ళలో
విమానాశ్రయాలు, జాతీయ రహదారుల సంఖ్య రెండింతలకు పెరగడమే అందుకు తార్కాణం.
తమిళనాడు,
లక్షద్వీప్, కేరళ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడుతున్నారు.
.
నేడు
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పర్యటించిన ప్రధాని మోదీ, రూ. 20 వేల కోట్ల
అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. తిరుచిరాపల్లి ఎయిర్ పోర్టు కొత్త టెర్మినల్
పనులు ప్రారంభించారు. రూ. 1100 కోట్లతో ఈ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు.
ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణించేలా దీనిని అభివృద్ధి చేయడంతో పాటు రద్దీ సమయంలో
గంటకు 3,500 మంది రాకపోకలు సాగించేలా మౌలిక వసతులు కల్పించనున్నారు.
ప్రధాని
మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విమానాశ్రయాల
అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా అన్నారు. ఎయిర్
పోర్టులు ప్రయాణీకుల అవసరాలు తీర్చడంతో పాటు అభివృద్ధి కేంద్రాలుగా
నిలుస్తున్నాయన్నారు. ఎంతో మందికి ఉపాధి
దొరకడంతో పాటు సంపద సృష్టి కి అవకాశం లభించిందన్నారు. హవాయి చెప్పులు వేసుకునే వారు
కూడా విమానాల్లో ప్రయాణించే స్థాయికి ఎదగాలనేది ప్రధాని మోదీ స్వప్నమని చెప్పారు.
పలు
రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు.
సేలం-మాగ్నేసైట్ జంక్షన్, ఓమ్లూర్-మెట్టూర్
డామ్ సెక్షన్ లో 44. 4 కిలోమీటర్ల పొడువునా రైల్వే లైన్ డబ్లింగ్ పనులను ప్రధాని
ప్రారంభించారు. మదురై-తూత్తుక్కుడి పనులు
కూడా జరుగుతున్నాయి. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి అయితే తమిళనాడులో
రైలు సౌకర్యం మెరుగుపడుతుంది. పాసింజర్ రైళ్ళతో పాటు గూడ్స్ రైళ్ల సర్వీసులు పెరిగి
స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
పర్యటనలో భాగంగా ఐదు రోడ్డు ప్రాజెక్టులను
జాతికి అంకితమిచ్చారు. తిరుచ్చి- కల్లగమ్ నాలుగు లైన్ల రోడ్డు, అలాగే కల్లగమ్ –మీన్సురేటి,
చెట్టికులమ్-నాథమ్ సెక్షన్ రోడ్లను ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన రోడ్లు
తమిళనాడు పారిశ్రామిక ప్రగతిలో కీలకంగా మారనున్నాయి.
భారతీదాసన్
విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
చేశారు.
పరిణతి
చెందిన పునాదిపై బారతీ దాసన్ విశ్వవిద్యాలయం ప్రారంభమైందన్నారు. నలంద, తక్షశిల,
కాంచీపురం, గంగైకొండ చోళపురం, మదురై గతంలో గొప్ప విద్యాకేంద్రాలుగా భాసిల్లిన
విషయాన్ని గుర్తు చేసిన మోదీ, యువత వేగం, నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు. 2014లో
భారత్ నాలుగు వేల ఆవిష్కరణలు చేస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 50 వేలకు చేరిందని
వివరించారు. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు యువత కృషి చేయాలని కోరారు.
ప్రధాని పర్యటనలో తమిళనాడు గవర్నర్ రవి,
ముఖ్యమంత్రి స్టాలిన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పాల్గొన్నారు.