Venkatesh Prasad elated
getting Ram Mandir Consecration Invite
భారత క్రికెట్లోని గొప్ప పేస్ బౌలర్లలో
వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) ఒకడు. ఒక దశలో భారతదేశంలో పేస్ బౌలర్లే లేరు అని అందరూ అనుకునే వేళ,
జవగళ్ శ్రీనాథ్‌తో కలిసి మన ఫాస్ట్‌బౌలింగ్ రుచి ప్రపంచానికి చూపించిన ఆటగాడు.
వన్డే క్రికెట్లో అతను నెలకొల్పిన రికార్డులు గొప్పవి.
ఇవాళ వెంకటేష్ ప్రసాద్‌కు అయోధ్యలోని రామమందిర
ప్రాణప్రతిష్ఠ (Ayodhya Ram Temple)
కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఆ విషయాన్ని
ఆనందంగా ‘ఎక్స్’లో పంచుకున్నాడాయన.
‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణం నా
జీవితకాలంలో పూర్తవాలని నా ఆశ, నా కోరిక. ఇది ఎంత గొప్ప సమయం! ఈ నెల 22న రామమందిరానికి
ప్రాణప్రతిష్ఠ (Consecration
Ceremony) జరుగుతోంది. భారతదేశం గర్వించే ఆ గొప్ప
కార్యక్రమం నా జీవితకాలంలోనే సాకారమవుతోంది. అంతేకాదు, ఆ కార్యక్రమానికి నాకు ఆహ్వానం
అందడం ఎంత అదృష్టం. ఆ రామయ్య ఆశీస్సులతోనే నన్ను ఈ అదృష్టం వరించింది. జై
శ్రీరామ్’’ అని వెంకటేష్ ప్రసాద్ తన ‘ఎక్స్’ ఎకౌంట్లో ట్వీట్ చేసాడు.
జనవరి 22న అయోధ్యలో
జరగబోయే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా
జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణ పనులు, మందిర ప్రారంభోత్సవ పనులు, ప్రముఖులకు
ఆహ్వానాలు అందించే పనులూ శ్రీరామజన్మభూమి
తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో సాగుతున్నాయి.