Owaisi accuses Hindus will take away mosques
రామమందిర ప్రారంభోత్సవం దగ్గరపడుతున్న వేళ, ఎంఐఎం
నేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi, AIMIM) హిందువుల మీద మరోసారి విషం వెదజిమ్మారు. హిందువులు మసీదులను
ఆక్రమించేస్తారని (Hindus will take away Mosques), అందువల్ల మసీదుల్లో ఎప్పుడూ జనాలు నిండుగా ఉండాలనీ (Mosques should remain inhabitated) ఒవైసీ
పిలుపునిచ్చారు. ప్రత్యేకించి, బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చర్యలను
జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని హెచ్చరించారు.
అయోధ్యలో రాముడి ఆలయాన్ని బాబర్ కూలగొట్టి కట్టిన
మసీదును ఐదువందల యేళ్ళ తర్వాత చట్టబద్ధంగా సొంతం చేసుకుని రామమందిరాన్ని మళ్ళీ
కట్టుకుంటున్న వేళ, ఒవైసీ నోటికివచ్చిన అబద్ధాలు ఆడుతూ (Owaisi lies, tries to spill poison in the minds of Muslim youth) ముస్లిముల మనసుల్లో విషం
నింపే ప్రయత్నం చేసారు. గత ఐదు వందల యేళ్ళుగా కొరాన్ చదివిన ప్రదేశం ఇకపై తమ
చేతుల్లో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
భాగ్యనగరంలోని భవానీ నగర్ ప్రాంతంలో మహమ్మదీయుల సభలో
మాట్లాడిన ఒవైసీ ‘‘ముస్లిం యువకులారా, నా మాట వినండి. మనం మన మసీదుని కోల్పోయాం.
అక్కడ ఏం జరుగుతోందో మీరు చూస్తూనే ఉన్నారు. మీ గుండెల్లో బాధ కలగడం లేదా?’’ అంటూ
వారిని రెచ్చగొట్టారు.
‘‘మనం 500 సంవత్సరాల పాటు కూర్చుని కొరాన్ చదివిన
ప్రదేశం ఇక మనది కాకుండా పోయింది. ముస్లిం యువతకు కు కనిపించడం లేదా? ఇంకో మూడు
నాలుగు మసీదుల గురించి కూడా కుట్రలు జరుగుతున్నాయి. వాటిలో ఢిల్లీలోని సునహరీ (బంగారు)
మసీదు కూడా ఉంది. ఎన్నో యేళ్ళ కఠోర పరిశ్రమ తర్వాత మనం ఇఫ్పుడున్న స్థానానికి
చేరుకున్నాం. మీరు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి’’ అని ఎంఐఎం నేత పిలుపునిచ్చారు.
‘‘మీరు మనకు అండగా ఉండండి, మన మసీదులను ఎప్పుడూ
జనాలతో నిండి ఉండేలా చూడండి. లేదంటే వాటిని మనకు దూరం చేసేస్తారు. నేటి ముస్లిం
యువత తన తల పైకెత్తి ఆలోచించాలి. తనకు తాను ఎలా సాయం చేసుకోవాలి? తన కుటుంబానికి,
తన నగరానికి, తన ప్రాంతానికీ ఎలా సాయపడాలి అని ఆలోచించాలి. ఐకమత్యమే మహాబలం,
ముస్లిములందరూ కలిసికట్టుగా ఉండాలి’’ అని హెచ్చరించారు.
నిజానికి ఏదైనా నిర్మాణం మీద మసీదు కట్టకూడదని
ఇస్లాం నియమం. అలాంటిది ఒక గుడిని పగలగొట్టి దాని శిథిలాలతోనే దానిపై మసీదు కడితే
అది మసీదు ఎలా అవుతుంది. ఏళ్ళ తరబడి నమాజ్ జరగని ప్రదేశాన్ని మసీదుగా పరిగణించరు. అలాంటిది
కొన్ని వందలయేళ్ళుగా ముస్లిములు ఎవ్వరూ నమాజ్ చేయని ప్రదేశాన్ని మసీదు అని ఎలా
అంటారు? న్యాయస్థానం తీర్పు ఆధారంగా హిందువులు తమ ఆలయాన్ని కట్టుకుంటుంటే దాన్ని
ఆక్రమణ అని ఎలా అంటారు? దేశవ్యాప్తంగా లక్షలాది ఆలయాలు పడగొట్టి మసీదులు కట్టారు
కదా… వాటిలో హిందువులకు అతిపవిత్రమైనవి అయిన మూడు చోట్ల (అయోధ్య, మథుర, కాశీ) మసీదులను
హిందువులకు అప్పజెప్తే వారికి వచ్చే నష్టమేమిటి? సెక్యులరిజం పేరుతో ఎంతసేపటికీ
హిందువుల మీద పడి ఏడ్చేవారు అదే సెక్యులరిజం ముస్లిములు, క్రైస్తవులకు కూడా
వర్తిస్తుందని ఎందుకు గ్రహించరు? గంగా జమునా తెహజీబ్ అని నోటిమాట కబుర్లు
చెప్పేవారు ఆ తెహజీబ్ కోసం మూడు మసీదులను ఎందుకు వదిలిపెట్టలేరు? మెజారిటీ హిందువులు
ఉండే దేశంలో హిందువులతో సామరస్యంగా కలిసి ఉండడం గురించి ఎందుకు ఏ ముస్లిం నేతా
మాట్లాడడు?
ఇలాంటి ప్రశ్నలు వేటికీ
జవాబులు చెప్పని ఒవైసీ, అబద్ధాలు చెప్పి ముస్లిం యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇంకా
చేస్తూనే ఉండడం గర్హనీయం. ఉదారవాద ముస్లిం యువతరం ఆ దిశగా ఆలోచించి, ఒవైసీ వంటి
దుర్మార్గ నాయకుల కల్లబొల్లి మాటలకు లొంగిపోకుండా ఉండాలి.