ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అరాచకం వెలుగు చూసింది. స్వామివారి దర్శనం కోసం సిద్దంశెట్టి సురేశ్ ప్రసాద్ అనే భక్తుడు ఇవాళ ఉదయం కుటుంబ సమీతంగా శ్రీశైలం చేరుకున్నాడు. స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరే సమయంలో సురేశ్ ప్రసాద్ కళ్లు తిరిగి కిందపడిపోయారు.
సాక్షి గణపతి ఆలయం వద్ద కుప్పకూలి కిందపడిపోయిన, సురేశ్ ప్రసాద్‌ను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. గంటసేపు వేచిచూసినా సురేశ్ ప్రసాద్‌ను ఎవరూ కనీసం ఆటోలో నుంచి ఆసుపత్రిలోపలకు తీసుకువెళ్లలేదు. సురేశ్ ప్రసాద్ భార్య ఎంత ప్రయత్నించినా ఆస్పత్రి సిబ్బంది సహకరించలేదు. కనీసం వైద్యులు కూడా స్పందించలేదు. వైద్యం అందక సురేశ్ ప్రసాద్ చనిపోయాడని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ప్రాథమిక వైద్యం అందించి ఉంటే తన భర్త బతికేవాడని సురేశ్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.