అయోధ్య
రామమందిరంలో ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహాన్నిఖరారు చేశారు. దేశంలోని
ప్రముఖు శిల్పులు చెక్కిన మూడు విగ్రహాలకు ఓటింగ్ నిర్వహించి మెరుగైనదానిని ఎంపిక
చేశారు.
కర్ణాటకకు
చెందిన ప్రముఖ శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడిని భవ్య రామమందిరంలో
ప్రతిష్టించనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
మందిర నిర్మాణ
పనులు పర్యవేక్షిస్తున్న శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ విషయాన్ని
అధికారికంగా ప్రకటించమే మిగిలి ఉందన్నారు.
శ్రీరాముడు,
హనుమస్వామి బంధాన్ని వివరించేలా ‘రాముడు
ఎక్కడుంటే ఆంజనేయుడు అక్కడే’ అంటూ రామ్
లల్లా విగ్రహ ఎంపిక గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని ప్రహ్లాద్ జోషి
పంచుకున్నారు.
‘వాల్మీకి
రామాయణం ప్రకారం ఆంజనేయ స్వామి జన్మస్థలం కర్ణాటక అని ఇదే విషయాన్ని సీతమ్మవారితో
సంభాషణ సందర్భంగా తనది గోకర్ణమని సాక్షత్తూ హనుమస్వామినే తెలిపారని’ ఉటంకించారు.
గోకర్ణ ప్రాంతం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుంది.
తుంగభద్ర
నది ఒడ్దున హంపీకి సమీపంలోని అంజనాద్రి పర్వతం కూడా ఆంజనేయుడి జన్మస్థలం అని
పలువురు విశ్వసిస్తారు.
బాలరాముడి
విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ ను అభినందించిన కేంద్రమంత్రి
ప్రహ్లాద్ జోషి, శ్రీరామాంజనేయ స్వాముల బంధం మరోసారి బహిర్గతమైందన్నారు.
బాల రాముడి విగ్రహాన్ని చిన్నచిన్నలోపాలు కూడా
లేకండా తీర్చిదిద్దిన అరుణ్ ను ప్రవీణ్యాన్ని ప్రశంసించారు.
ఐదేళ్ళ
వయస్సున్న రామ్ లల్లా విగ్రహాం ఎత్తు 51 అంగుళాలు ఉంది. శుక్రవారం మూడు విగ్రహాలకు
శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓటింగ్ నిర్వహించింది. ఎంపిక
ప్రమాణాలేంటని ఆలయ ట్రస్ట్ సభ్యుడు విమిలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రాను ప్రశ్నించగా,
విగ్రహమే మీకు సమాధానం చెబుతోంది. అది మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తోందన్నారు.
కర్ణాటకకు
చెందిన మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్ నుంచి సత్యనారాయణ పాండేు కూడా పోటీ
పడ్డారు. గణేశ్, అరుణ్ కృష్ణశిలను
వాడగా, సత్యానారాయణ పాండే మక్రాన్ తెల్లటి చలువరాయితోో విగ్రహాన్ని తయారు చేశారు.
వీటిని కూడా ఆలయంలో వేరు వేరు చోట్ల ప్రతిష్టించనున్నారు. ముంబైకి చెందిన ఆర్టిస్టు
వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ ల ఆధారంగా రామలల్లా విగ్రహాన్ని చెక్కారు.
జనవరి
22న మధ్యాహ్నం 12.20 నిమిషాలకు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
నిర్వహిస్తారు. ప్రధాని మోదీతో పాటు
కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం కావడంతో ఆయన
కుటుంబానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది.