దక్షిణకొరియా ప్రతిపక్ష సీనియర్ నేత లీ జే మ్యూంగ్పై హత్యాయత్నం (crime news) జరిగింది. బుసన్ ఎయిర్పోర్టు పనులు పరిశీలిస్తుండగా గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. డెమొక్రాటిక్ నేత మ్యూంగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుండగుడు మ్యూంగ్ మెడపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన మ్యూంగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడికి దిగిన దుండగుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కిరీటం తరహాలో ఓ వస్తువును ధరించి దుండగుడు దాడికి దిగినట్లు తెలుస్తోంది. లీ జే మ్యూంగ్ అనేక విషయాలను ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొడతారనే పేరుంది. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తొలగించగల నేతగా కొందరు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం మ్యూంగ్ దేశానికి ప్రమాదకారని అభివర్ణిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మ్యూంగ్ ఓటమిని చవిచూశారు.