Office of woman
minister vandalized
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోవైద్యశాఖ
మంత్రి విడదల రజిని (Health Minister Vidadala Rajini) కార్యాలయంపై దాడి జరిగింది. కొత్తగా నిర్మించిన భవనం మీద రాళ్ళతో
దాడి చేసారు. అద్దాలు పగలగొట్టారు, ఫ్లెక్సీలు చించేసారు. (Minister Office Vandalized) ఈ ఘటనపై మంత్రి తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసారు.
గుంటూరు నగరంలో గత అర్ధరాత్రి తర్వాత మంత్రి
కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఉదయం రజిని ఘటనా స్థలానికి చేరుకుని విధ్వంసం
తీవ్రతను పరిశీలించారు. ఈ దాడి తెలుగుదేశం-జనసేన కార్యకర్తల పనే అని అధికార
వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి దాడులతో తనను భయపెట్టలేరని రజని మండిపడ్డారు.
పక్కా ప్రణాళిక ప్రకారం ఎక్కడినుంచో రాళ్ళు తీసుకొచ్చి మరీ దాడి చేసారని, ఆ దాడి
వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ మంత్రి అన్నారు.
చంద్రబాబు, నారా లోకేష్లకు బీసీలపై కపట
ప్రేమ కాబట్టే బీసీ మహిళనైన తన కార్యాలయం మీద దాడి చేయించారని రజిని వ్యాఖ్యానించారు.
అధికార దాహంతో, ఎన్నికల్లో ఓటమి భయంతో దాడి చేయించారని మండిపడ్డారు. దాడి సమయంలో
పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేసినా, దాడి కొనసాగించారని మంత్రి
అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని
విచారిస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ కొత్త
కార్యాలయం ప్రారంభించుకోడాన్ని టీడీపీ-జనసేన జీర్ణించుకోలేక పోతున్నాయని ఎమ్మెల్యే
మద్దాలి గిరి అన్నారు. జయహో బీసీ అంటూనే బీసీ మహిళా మంత్రి కార్యాలయంపై రాళ్ళు
రువ్వడం వారి దుండగీడు మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. బీసీ మహిళ ఎన్నికల
బరిలో నిలిచి గెలవడాన్ని తట్టుకోలేకనే ఇలాంటి దాడులు చేయించారని చెప్పారు. నిందితులపై
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.