తీవ్ర భూకంపం జపాన్ దేశాన్ని(japan earth quake) కుదిపేసింది. భూకంపాల దేశంగా పేరున్న జపాన్ను నూతన సంవత్సరం మొదటి రోజే కంపనాలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేలుపై 7.4గా తీవ్రత నమోదైంది.భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో జపాన్ వాతావరణ సంస్థ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
తీర ప్రాంత రాష్ట్రాలైన నీగట, తొయామా, ఇషికావా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇషికావాలోని వాజిమా నగర తీరంలో అలలు ఎగసిపడుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ భూకంపం ప్రభావం అణుకేంద్రాలపై ఉంటుందా? లేదా అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్నారు.ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అందాల్సి ఉంది.