వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడి ప్రేమ వివాహంపై (ys rajareddy love marriage) ట్వీట్ చేశారు. తన కుమారుడి వివాహం ఫిబ్రవరి 17న జరగనుందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు షర్మిల ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు ఆమె ప్రకటించారు.దీంతో గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న వారి ప్రేమ వివాహం వ్యవహారానికి తెరపడినట్లైంది.
తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షర్మిల, కుమారుడు రాజారెడ్డి వివాహంపై స్పందించారు. జనవరి 18న ఇడుపులపాయలో నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. మంగళవారంనాడు అంటే రేపు ఇడుపులపాయలో కాబోయే వధూవరులతో కలసి వైఎస్ఆర్ ఘాట్ సందర్శించనున్నట్లు షర్మిల చెప్పారు.తొలి ఆహ్వాన పత్రిక వైఎస్ సమాధి వద్ద ఉంచి తన తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.