దేశ ప్రజలకు ప్రధాని మోదీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు (pm modi happy new year 2024 wishes) తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో శాంతియుతంగా జీవించాలని ఆకాక్షించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 నూతన ఏడాది ప్రజలందరికీ ఆరోగ్యం,శ్రేయస్సు ఇవ్వాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారత ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని, 108వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భరత సాధించడంతోపాటు, రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా నిలపాలని కోరారు. 2023లో స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.