16th Finance Commission Chairman
Arvind Panagariya
నీతి
అయోగ్ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసిన అరవింద్ పనగఢియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్
గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ
ముర్ము ఆమోదంతో ఈ ఆర్థిక సంఘాన్ని కేంద్రప్రభుత్వం నియమించింది.
కేంద్ర
ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండే దీనికి కార్యదర్శిగా
వ్యవహరించనున్నారు. ఆర్థిక సంఘం పదవీకాలం
2025, అక్టోబర్ 31తో ముగియనుంది. ఇందులో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. కేంద్ర-
రాష్ట్రప్రభుత్వాల ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చేందుకు ఈ రాజ్యాంగబద్ధ సంస్థను
ఏర్పాటు చేశారు.
ప్రణాళికా
సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన నీతి అయోగ్ కు తొలి వైస్ చైర్మన్
గా పనగడియా పనిచేశారు.
1952 సెప్టెంబర్ 30న జన్మించిన అరవింద్, న్యూయార్క్
కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆసియా డెవలప్మెంట్
బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
లో వివిధ హోదాల్లో పనిచేశారు.