ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి మూడు దశాబ్దాల పాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరిగాడు. చివరకు పోలీసులు అతన్ని ముంబయిలో పట్టుకున్నారు. 1989లో ఓ వ్యక్తి హత్య కేసులో (crime news) దీపక్ నారాయణ్ భీసే నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో పోలీసులను అతన్ని అరెస్ట్ చేశారు. 1992లో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆ తరవాత వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
మూడు దశాబ్ధాలుగా నిందితుడు పోలీసులను కూడా బురిడీ కొట్టించాడు. ముంబైలోని కాందివీలీకి పోలీసులు వచ్చినప్పుడు స్థానికులు కూడా అతను చనిపోయి ఉంటాడని చెప్పారు. అతని విషయాలు పోలీసులకు చెప్పేవారు కాదు. అయినా పోలీసులు వదల్లేదు. ఇటీవల భీసే భార్య ఫోన్ నెంబరు పోలీసులకు చిక్కింది. దాన్ని ట్రాక్ చేయగా నాలాసొపారా ప్రాంతంలో నిందితుడు దొరికాడు. మూడు దశాబ్దాల్లో నిందితుడు అనేక ప్రాంతాలు మార్చాడని పోలీసులు తెలిపారు. రెండేళ్లుగా నాలాసొపారాలో ఉంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.