Centre Bans Tehreek-E-Hurriyat
జమ్ము
కశ్మీర్ కేంద్రంగా ఉంటూ పాకిస్తాన్ అనుకూల
వైఖరి అనుసరిస్తూ భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వేర్పాటువాద సంస్థ తెహ్రీక్ ఏ హురియత్ (teh) పై నిషేధం విధించినట్లు కేంద్ర
హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంతో పాటు భారత వ్యతిరేక ప్రచారానికి తెగబడినందునే చట్టవ్యతిరేక సంస్థగా
ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ
నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏ
రూపంలోనూ ఉపేక్షించదన్నారు.
భారత్
నుంచి జమ్ముకశ్మీర్ ను వేరు చేసి అక్కడ ఇస్లామిక్ పాలన ఏర్పాటుకు ఈ సంస్థ
పనిచేస్తోందని, అందుకే ఉపా చట్టం కింద చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ పాకిస్తాన్
అనుకూల సంస్థ కు గతంలో వేర్పాటువాది నేత సయ్యద్ అలి షా గిలానీ నేతృత్వం వహించారు. ప్రస్తుతం మసరాత్ అలామ్ భట్ బాధ్యతలు తీసుకున్నారు. ఇతడు
కూడా పాకిస్తాన్ అనుకూల వైఖరితో ఉంటూ భారత్ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు.
ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందించాడనే అభియోగంపై
మసరత్ ను 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేయగా కోర్టు శిక్ష విధించడంతో
తిహాడ్ జైల్లో ఉన్నాడు. ముస్లిం లీగ్
పేరిట ఓ రాజకీయ పార్టీని కూడా మసరత్ స్థాపించాడు. దీనిని కూడా కేంద్రం
నిషేధించింది.