వైసీపీ
పాలనపై బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మరోసారి ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ వికసిత్ సంకల్పంతో ముందుకు సాగుతుంటే, సీఎం జగన్
మాత్రం ఆంధ్రప్రదేశ్ నాశనం కోసం శ్రమిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన దినకర్,
అర్హులందరికీ
సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ, వికసిత్ సంకల్ప్ భారత్
యాత్రను ప్రారంభించారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో 2.60
లక్షల పంచాయతీలు, 4 వేలకు పైగా పట్టణ స్థానిక సంస్థల
పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను
వైసీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించి ప్రజలను మోసం చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి
కుటుంబ సభ్యుల పేర్లు ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
ప్రజలను మోసం చేసి ఓట్లు పొందేందుకు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారా అని
నిలదీశారు.
ఆదాయం
సృష్టించే ఆస్తుల కల్పన లేకుండా రాష్ట్రంపై 12
లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం ధర్నాలు, హర్తాళ్ళ తో హోరెత్తుతోందని, ప్రభుత్వ
ఉద్యోగుల దగ్గరి నుంచి వలంటీర్ల వరకు అంతా జగన్ పాలనను తప్పుబడుతున్నారని
దుయ్యబట్టారు.
రహదారులు
గుంతల మయంగా మారినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్న బీజేపీ నేత దినకర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఎందుకు మళ్లించారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి
కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి లేక యువత వలసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గుండ్లకమ్మ, తోటపల్లి జలాశయాల నిర్మాణం పూర్తి
చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యమైన
విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించక పోవడంతో
వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతోందన్నారు. ప్రకృతి వైఫరీత్యాలతో నష్టపోయిన రైతులు
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
మూడు
రాజధానుల పేరిట రాష్ట్రప్రజలను మోసం చేసిన ఘనత వైసీపీ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
బీజేపీ
పాలనతో అన్ని వర్గాలకు మేలు…
ప్రధాన
మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రాష్ట్రంలో 50 లక్షలమంది రైతులు మేలు పొందుతున్నారని
వారంతా బీజేపీ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7 మిలియన్ల “కిసాన్ క్రెడిట్ కార్డ్లు”
జారీ చేసి బ్యాంకుల నుంచి రైతులు రుణాలు పొందే అవకాశాన్ని సులభతరం చేసిన ఘనత
బీజేపీదేనన్నారు.
ప్రధాన,
చిన్న నీటిపారుదల వ్యవస్థలతో నీటి నిర్వహణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం
“కృషి సంచాయ్ యోజన” ద్వారా 25
శాతం నుంచి 60 శాతం వరకు రాయితీ అందజేస్తోందన్నారు.
కేంద్రప్రభుత్వం
దాదాపు 75 శాతం పైగా నిధులు ఇచ్చిన కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగా
పేదల గృహానిర్మణాల్లో జాప్యం చోటుచేసుకుందన్నారు.
కోవిడ్
సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి పేద, మధ్య తరగతి వర్గాలను రక్షించేందుకు కేంద్రం
అమలు చేసిన ” పీఎం స్వనిధి పథకం” ఎంతో మందికి బాసటగా నిలించిందని సంతోషం
వ్యక్తం చేశారు.
విశ్వ
కర్మ యోజన పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం 18
కేటగిరీల హస్తకళాకారుల కోసం రూ. 13 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయాన్ని ప్రజలు
గమనించాలని కోరారు.
మోదీ
గ్యారెంటీ వాహనంతో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. అర్హులైన ప్రతీఒక్కరూ కేంద్రప్రభుత్వం అమలు
చేస్తోన్న పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లబ్ధిదారుల ఇంటి దగ్గర
కల్పిస్తున్నామన్నారు.
అంగన్వాడీలు, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది చేపట్టిన సమ్మెలకు రాబోయే కొత్త ప్రభుత్వంలో
పరిష్కారం దొరుకుతుందని ఆశిందామన్నారు.