US Shoots Anti-Ship Missiles
ఎర్ర
సముద్రంలో హౌతీ రెబల్స్ ప్రయోగించిన యాంటి షిప్ బాలిస్టిక్ మిసైళ్ళను విజయవంతంగా
అడ్డుకుని పేల్చివేసినట్లు అమెరికా తెలిపింది. వీటిని హౌతీ రెబల్స్ యెమెన్ నుంచి ప్రయోగించినట్లు అమెరికా మిలటరీ
తెలిపింది. దాడికి గురైన కంటైనర్ షిప్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తాము
స్పందించినట్లు వివరించింది.
ఇరాన్
ప్రోద్బలంతో హౌతీ రెబల్స్ ఇష్టానుసారం పేట్రేగిపోతున్నారని అమెరికా సెంట్రల్
కమాండ్(CENTCOM) తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది. అంతర్జాతీయ
వాణిజ్య నౌకలపై నవంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 సార్లు హౌతీలు దాడులకు తెగబడ్డారని
పేర్కొంది.
పాలీస్తానాపై
ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ తాము ఈ చర్యలకు పాల్పడుతున్న హౌతీలు
చెబుతున్నారు.
ఎర్ర
సముద్రం గుండా సింగపూర్ జెండాతో వెళుతున్న డెన్మార్క్ నౌకపైకి క్షిపణలు
ప్రయోగించారనే సమాచారం అందగానే యూఎస్ గ్రావ్లీ, యూఎస్ లాబూన్ లు వాటిని అడ్డుకుని
పేల్చివేసినట్లు సెంటికమ్ తెలిపింది.
ప్రపంచ వాణిజ్యంలో ఎర్రసముద్రం ద్వారా 12 శాతం జరుగుతుంది. దీంతో
తిరుగుబాటు దారుల దాడుల నుంచి రక్షణ కోసం అంతర్జాతీయ నావెల్ టాస్క్ ఫోర్సును
అమెరికా ఏర్పాటు చేసింది.