Australia win by 3 runs:
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ
భారత మహిళల జట్టు ఓడింది. దీంతో సిరీస్ పరాజయంతో 2023 ఏడాదిని భారతీయ మహిళల జట్టు ముగించింది.
ముంబైలోని
వాంఖడే వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతిలో మూడు
పరుగుల తేడాతో ఓటిమి చెంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోయింది.
టాస్
గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి
258 పరుగులు చేసింది. లిచ్ఫీల్డ్(63),
ఎలీసాఫెర్రీ(50) రాణించారు.
భారత
బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా, పూజా, శ్రేయాంక, స్నేహ్ రాణా తలా ఒక
వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య
ఛేదనలో భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు మాత్రమే
చేయగల్గింది.
రిచ ఘోష్(96) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా గెలుపు దక్కలేదు. జెమీమా
రోడ్రిగ్స్(44), స్మృతి మంధన(34) శ్రమించినా మూడు పరుగులు తేడాతో మ్యాచును
కోల్పోవాల్సి వచ్చింది. 218 పరుగుల వద్ద
నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు కూడా మ్యాచ్ పై భారత్ పట్టు కొనసాగించింది. కానీ
చివరి ఓవర్లకు వచ్చే కొద్దీ మ్యాచ్ చేజారింది. ఆఖరి ఓవర్ లో 16 పరుగులు అవసరం కాగా
12 రన్స్ మాత్రమే చేయగల్గారు.
ఇరు
జట్ల మధ్య మూడో మ్యాచ్ మంగళవారం జరగనుంది.