PSLV-C58 Mission is to launch XPOSAT: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(isro)
ఆంగ్ల సంవత్సరం-2024 ఆరంభం రోజున కీలక ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి ఒకటిన
పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం చేపట్టనుంది.
ఇందు కోసం నేటి ఉదయం 8.10 గంటలకు ప్రయోగానికి
కౌంట్‌డౌన్ ప్రారంభించింది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్
సెంటర్ నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్ళనుంది.
గత
ప్రయోగాలకు భిన్నంగా ఎక్స్ రే తో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను
ఛేదించడం ఈ ప్రయోగ లక్ష్యం.
ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్ళు కాగా ఈ సారి ఈ
ఉపగ్రహంతో పాటు మరో పది ఇతర పేలోడ్ లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి
పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ గా పేరుపెట్టారు. బరువు 260 టన్నులు కాగా, పొడవు 44.4 మీటర్లు. ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.5 నిమిషాల్లో
పూర్తి చేసేలా సన్నాహాలు చేశారు. పీఎఎస్ఎల్వీ రాకెట్ సిరీస్ లో ఈ ప్రయోగం 60వ ది
కావడం విశేషం.