నైట్ హుడ్ ప్రతిష్ఠాత్మక పురస్కారం భారత సంతతి వ్యక్తిని వరించింది. బ్రిటన్‌లోని భారత సంతతి డాక్టర్ అమృత్‌పాల్ సింగ్, ప్రతిష్ఠాత్మక హంగిన్ పురస్కారం నైట్‌హుడ్‌కు (knightwood award) ఎంపికయ్యారు. కొత్త సంవత్సరంలో కింగ్ చార్లెస్ 3 పురస్కార గ్రహీతలను సన్మానిస్తారు. డాక్టరుగా మూడు దశాబ్దాల అనుభం కలిగిన అమృత్‌పాల్ సింగ్ న్యూకాజిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అమృత్‌పాల్ సింగ్ గతంలో బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా చేశారు. బ్రిటన్ దేశంలో అసాధారణ విజయాలు సాధించిన వారికి నైట్హుట్ పురస్కారం ఇస్తుంటారు. విధి నిర్వహణలో అమృత్‌పాల్ సింగ్ నిస్వార్థ సేవలకు ఈ పురస్కారం ఓ ప్రతీకగా నిలుస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పురస్కారం అందుకున్న వారిలో మరికొందరు భారతీయులు కూడా ఉన్నారు.