అమ్మ ప్రేమకు వెలకట్టలేం. పిల్లలపై తల్లి చూపించే ప్రేమ అపారం. ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడటం తల్లులకే చెల్లుతుంది. అయితే ఓ కర్కోటకురాలు ఇద్దరు చిన్నారులను నీటి బకెట్లో వేసి ఊపిరాడకుండా చేసి చంపిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటు చేసుకుంది. ఆ తరవాత ఆమె కూడా ఆత్మహత్యకు (crime news) ప్రయత్నించిన ఘటన సంచలనంగా మారింది.
మంత్రాలయం సమీపంలోని హాల్వి గ్రామానికి చెందిన రామకృష్ణ, శారదలకు ఇద్దరు బిడ్డలు. శనివారం శారద ఇద్దరు కుమారులను నీటి బకెట్లో వేసి గాలి ఆడకుండా చేసి చంపేసింది. పసి పిల్లలు అపస్మారక స్థితిలో ఉండగా భర్త గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే వారు ప్రాణాలు వదిలారు.పిల్లలను చంపేసినట్లు ఇంట్లో తెలిస్తే, తనను కూడా చంపుతారనే భయంతో తల్లి శారద కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులను ఎందుకు చంపింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.