మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (fire accident) జరిగింది. చేతికి వేసుకునే గ్లవుజుల తయారీ కర్మాగారంలో చెలరేగిన మంటల్లో ఆరుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున చెలరేగిన మంటల్లో ఆరుగురు కార్మికులు చనిపోయినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.
అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకునే సరితే మొత్తం కాలిబూడిదైందని తెలుస్తోంది. ప్రమాదం నుంచి తప్పించుకున్నవారు లోపల ఆరుగురు కాలిపోయారని చెప్పడంతో తరవాత వారి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 15 మంది కార్మికులు నిద్రిస్తున్నారని బాధితులు చెప్పారు. కొందరు తప్పించుకున్నారు. మరికొందరు మంటల్లో కాలి చనిపోయారు. ప్రమాద కారణాలు మాత్రం తెలియరాలేదు.