PAVAN LETTER
TO PM
వైసీపీ
పాలనంతా అవినీతి, అక్రమాలేనని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేపట్టి
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. గృహ
నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన పవన్, వివరాలతో సహా ప్రధానికి
లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించి బాధ్యులను శిక్షించాలని
కోరారు.
పేదలకు
సొంతిళ్ళ పేరుతో కేవలం స్థలాల సేకరణకే రూ.35,141 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం వెచ్చించిదన్న
పవన్, అందులోనూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ విధానంలో అనేక
లోసుగులున్నాయని వివరించారు.
పేదలందరికీ
ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం, జగనన్న
లే అవుట్లలో కేవలం 12,09,022 మంది లబ్ధిదారులకు మాత్రమే స్థలాలు కేటాయించిందని
పేర్కొంది.
కేంద్ర
ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం
తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను రాష్ట్రప్రభుత్వం అమలు
చేసే పథకానికి వాడుకున్నారని తెలిపారు.
పేదల
నిర్మాణల కోసం రాష్ట్ర బడ్జెట్లలో రూ.23,106.85 కోట్లు కేటాయించి కేవలం
రూ.11,358.87 కోట్లు ఖర్చు చేయడం వెనుక అంతర్యాన్ని కనిపెట్టేందుకు దర్యాప్తు
అవసరం అన్నారు.
పీఎంఏవై (అర్బన్) పథకం ద్వారా రాష్ట్రానికి కేంద్రం
అందజేసిన సాయం రూ.14,366.08 కోట్లు అని పవన్ గుర్తు చేశారు. పేదల ఇళ్ళ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో
వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించి భారీగా అవినీతికి పాల్పడ్డారని లెక్కలతో
సహా వివరించారు.
రాష్ట్రంలో 6.68 లక్షల
టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి అయినప్పటికీ కేవలం 86, 984 మందికే అందజేశారన్నారు.
వైసీపీ ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచి గృహ నిర్మాణ శాఖ పేరిట చేసిన ప్రకటనలు, జరిగిన
అభివృద్ధి, వైసీపీ నేతలు అవినీతిని వివరిస్తూ ప్రధానికి ఐదు పేజీల లేఖను జనసేన
అధినేత పవన్ రాశారు.